దర్గాలో కేసీఆర్ ప్రత్యేక పూజలు..

SMTV Desk 2017-11-10 16:48:26  cm kcr, visited darga, rangareddy district,

రంగారెడ్డి, నవంబర్ 10 : ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే దర్గా వస్తానని మొక్కుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు రంగారెడ్డి జిల్లాలోని దర్గాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భారీ బందోబస్తు నడుమ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జహంగీర్ దర్గాను సందర్శించారు. అన౦తరం అక్కడ ప్రత్యేక పూజలు చేసి మొక్కులను సమర్పించారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, హో౦మంత్రి నాయిని నర్సింహారెడ్డిలు కలిసి ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్నారు.