రేవంత్ రెడ్డికి బర్త్ డే విషెస్ తెలిపిన కేసీఆర్

SMTV Desk 2017-11-10 12:21:45  CM KCR, Conveys birthday wishes, Revanth Reddy

హైదరాబాద్, నవంబర్ 10 : నిత్యం ఒకరిమీద ఒకరు విమర్శలు సంధించుకునే నేతలు అనూహ్యంగా కలవడం ఒక్క రాజకీయాల్లోనే సాధ్యం. తాజాగా అలాంటి పరిణామమే ఇక్కడ చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ఒకరంటే ఒకరు ఎడ మొహం, పేడ మొహం పెట్టుకొని ఉండే వీరిద్దరి తీరు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రేవంత్ పుట్టిన రోజును పురస్కరించుకొని కేసీఆర్ ఆయనకు పుష్ప గుచ్చ౦తో పాటు రెండు వాక్యాల లేఖను పంపించారు. ఆ లేఖలో "ఆ దేవుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి, మరెన్నో ఏళ్ళ పాటు ప్రజా సేవలో కొనసాగాలని కోరుకుంటున్నా" అని పేర్కొన్నారు. చిత్రమేమిటంటే.. ఇదివరకు రేవంత్ టీడీపీలో ఉన్నా, అంతకు ముందు గాని కేసీఆర్ రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపకపోవడం గమనార్హం. ఈ విషయంపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.