ఎస్సీ, ఎస్టీ మహిళలకు స్వీయ రక్షణపై శిక్షణ..

SMTV Desk 2017-11-09 19:11:18  sc,st womens self defending, hyderabad, women empowerment, jagadeeswar

హైదరాబాద్, నవంబర్ 09 : మహిళలకు మరింత రక్షణ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది, ఇందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ యువతులకు స్వీయ రక్షణపై శిక్షణ అందించనుంది. ఈ మేరకు బుధవారం మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్ మార్గదర్శకాలు విడుదల చేశారు. తెలంగాణలోని దుర్గాభాయ్ దేశముఖ్ వికాస కేంద్రంలో ఒక్కో బ్యాచ్ కు ఆరు రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో మహిళలకు స్వీయ రక్షణ ,ఆరోగ్యం, పోషకాహారం, బాల్య వివాహాల నుండి రక్షణ, చట్టాలు, అక్రమ రవాణా తదితర విషయాల పై అవగాహనా కల్పిస్తారు.