రైతులకు వ్యవసాయం దంగడ కాదు పండుగ :కేసీఆర్

SMTV Desk 2017-11-07 13:48:26  assembly, cm kcr, farmers, hyderabad

హైదరాబాద్‌, నవంబర్ 07 : తెలంగాణ రాష్ట్రంలో పత్తి రైతులను ఆదుకోవడమే ప్రభుత్వం ఉద్దేశమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో వ్యవసాయంతో రైతులకు దండుగ కాదు పండుగ వాతవరణంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేసీఆర్ తెలిపారు. సకాలంలో విద్యుత్‌ ఇచ్చి, విత్తనాలు, రుణమాఫీ అమలు చేశామన్నారు. ప్రస్తుతం పత్తి పండించే అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ 2 లేదా 3 స్థానాల్లో కొనసాగుతోంది. కొన్నిచోట్ల సీసీఐ మద్దతు ధర కన్నా అధిక ధరకు కొనుగోలు చేశారు. త్వరలో రైతులు పంట గురించి చర్చించుకునేందుకు వేదికలు ఏర్పాటు చేయనున్నారు. ఈ వేదికల కోసం వచ్చే బడ్జెట్‌లో రూ.300కోట్ల నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.