ప్రభుత్వం సిద్ధంగా ఉంది : సీఎం కేసీఆర్

SMTV Desk 2017-11-07 12:14:24  Assembly, cm kcr, bjp, jobs, hyderabad

హైదరాబాద్, నవంబర్ 07 : తెలంగాణ శాసనసభలో చర్చలు ప్రారంభమయ్యాయి. నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఈ సందర్భంగా భాజపా సభ్యులతో సభలో మాట్లాడుతూ... బీజేవైఎం చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్దేశం తాను అర్థం చేసుకోగలనని, ఈ అంశంపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించేందుకు సహకరించాలని భాజపా సభ్యులను కేసీఆర్ కోరారు. సమస్య తీవ్రతను ప్రభుత్వానికి తెలపడమే చలో అసెంబ్లీ, పార్లమెంటు ఉద్దేశమని ఆయన వెల్లడించారు.