భూ సమగ్ర సర్వేపై విమర్శలు సరికావు : కేసీఆర్

SMTV Desk 2017-11-06 16:20:00  Assembly, cm kcr,Congress Party members bhatti vikkamarka, comments, hyderabad

హైదరాబాద్, నవంబర్ 06 ‌: తెలంగాణ రాష్ట్ర శాసన సభ సమావేశంలో భూ రికార్డులపై చేపట్టిన చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. భూసమగ్ర సర్వేకు సంబంధించి ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టారు. దీనికి వెంటనే స్పందించిన కేసీఆర్.. సూర్యాపేట జిల్లాలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తండ్రి 15ఏళ్ల క్రితం అమ్మిన భూమికి కూడా గత ప్రభుత్వం పట్టా ఇవ్వలేకపోయిందని, భూ సమగ్ర సర్వేలో భాగంగా ఆ భూమికి తమ ప్రభుత్వం పట్టా ఇచ్చిందన్నారు. దీంతో భూరికార్డుల ప్రక్షాళనపై ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేయడం సరికాదని సీఎం కేసీఆర్‌ అన్నారు.