యాదాద్రి అభివృద్ధి అభినందనీయం : యనమల

SMTV Desk 2017-11-06 12:52:46  AP minister Yanamala Ramakrishna, yaadaadri, telangana cm kcr,

యాదాద్రి, నవంబర్ 06 : తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధి అందరి ప్రశంసలు పొందుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు తిరుమల క్షేత్రం మాదిరిగా తెలంగాణకు యాదాద్రి తలమానికమని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకుని, వేల కోట్లతో యాదాద్రి అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్‌ అభినందనీయుడని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని, తెలుగు ప్రజలందరూ సుఖసంతోషాలతో మెలగాలని స్వామిని ప్రార్థించామని యనమల తెలిపారు. యనమల, కేసీఆర్ పూర్వం తేదేపాలో మంచి మిత్రులైన విషయం అందరికి తెలిసిందే.