మిషన్ భగీరథపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధి ప్రశంస..

SMTV Desk 2017-11-03 11:41:02  world bank task team leader megval, Mission Bhagirathi Scheme

హైదరాబాద్, నవంబర్ 03 : తాగునీటి పథకాల నిర్వహణ-అభిప్రాయ సేకరణ అనే అంశంపై ప్రపంచబ్యాంకు హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో టాస్క్‌ టీఎం లీడర్‌(టీటీఎల్‌) మెగ్వెల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి తాగునీటిని సరఫరా చేసేందుకు చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం అద్భుతమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య ప్రాజెక్టు సంచాలకులు రాముల నాయక్‌, చీఫ్‌ ఇంజినీర్‌ విజయపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచబ్యాంకు నిధులతో పాత ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ జిల్లాల్లో చేపట్టిన కొన్ని తాగునీటి పథకాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఆ ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరై పూర్తయిన తాగునీటి పథకాల ద్వారా లభిస్తున్న ప్రయోజనాలను వివరించడం జరిగింది.