కాఫీలో కాక్రోచ్‌ కాళ్లు..

SMTV Desk 2017-10-20 17:14:18  Calcch legs in coffee, McDonalds Shop, in Thailand.

థాయిలాండ్, అక్టోబర్ 20 : పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నాయి. తాజాగా బ్యాంకాక్‌ లోని స్థానిక మెక్‌డోనాల్డ్స్‌ లో వినియోగదారుడు కాఫీ ఆర్డర్‌ చేస్తే అందులో కాక్రోచ్‌ కాళ్లు ఉన్నాయి. ఇది గమనించిన సదరు పౌరుడు.. ఈ సారి వేరే కప్పు తీసుకురమ్మనగా అందులో కూడా బొద్దింక కాళ్లు తేలుతూ కనిపించాయి. దీంతో మండిపడిన వినియోగదారుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఫేస్‌బుక్‌లో పంచుకున్నాడు. ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ ఘటనపై స్పందించిన మెక్‌డొనాల్డ్స్‌ సంస్థ యాజమాన్యం ఆ వినియోగదారుడికి క్షమాపణలు తెలియజేసింది.