త్వరలో అద్దెకు ఎయిర్‌క్రాఫ్ట్‌ సేవలు

SMTV Desk 2017-10-20 14:30:22   Aircraft services for rent soon, Ola, Uber Services.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20 : ఈ రోజుల్లో మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ లను బుక్ చేసుకొని గమ్య స్థానాలకు చేరుతున్నా౦. కాని ఎంత క్యాబ్ లను బుక్ చేసుకున్నా ట్రాఫిక్ నుండి మాత్రం తప్పించుకోలే౦. ఎంతటి దూరం ప్రయాణించాలన్నా ఈ సంస్థలు కార్లను అద్దెకు ఇస్తున్నాయి. త్వరలోనే వీటి మాదిరిగా ఎయిర్‌క్రాఫ్ట్‌ సర్వీసులను అద్దెకు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తుంది. అది కూడా ప్రస్తుతం వసూలు చేస్తున్న ధరలకు సగానికి తగ్గించి ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లను అద్దెకు ఇవ్వనుంది. ఎవరైనా ఎయిర్‌క్రాఫ్ట్‌ను వినియోగించుకుంటే ప్రయాణ దూర౦, అద్దె, ఖాళీగా తిరిగి వచ్చేందుకు ఇలా అన్నింటికీ కలుపుకొని రుసుములు వసూలు చేస్తున్నారు. ఈ కొత్త విధానంలో 50 శాతం వరకు ధరలను తగ్గించే అవకాశం ఉంది. ఎయిర్‌క్రాఫ్ట్‌లకు సంబంధించి త్వరలోనే హాలిడే ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తామని ఎయిర్‌ సహారా మాజీ అధ్యక్షుడు అలోక్‌ శర్మ అభిప్రాయపడ్డారు.