7.50 లక్షల మంది అధ్యాపకులకు వేతన పెంపు...

SMTV Desk 2017-10-12 12:17:24  Educators, Wage increment, Central Human Resources Department Minister Prakash Javadekar

న్యూఢిల్లీ, అక్టోబర్ 12 : 7వ దేశ సంఘం ప్రయోజనాలు కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఎయిడెడ్ కళాశాలల్లో పని చేస్తున్న 7.50 లక్షల మంది అధ్యాపకులకు వర్తింపు చేస్తూ కేంద్రమంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది జనవరి 1వ తేదీ నుంచి ఈ వేతన పెంపు అమలు చేయనుంది. దేశంలోని ఉన్నత విద్యాసంస్థలలోకి ప్రతిభ గల వారిని ఆకర్షించేందుకు ఈ వేతన పెంపు దోహదం చేస్తుందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జావ్‌డేకర్‌ వెల్లడించారు.