సింగరేణి కార్మికుల హామీలకు సర్వం సిద్ధం...

SMTV Desk 2017-10-10 17:01:24  Singareni workers, CMD Sridhar signing monday, as he gave word

కొత్తగూడెం, అక్టోబర్ 10: తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కార్మికులకు ఇచ్చిన ఆదేశాల మేరకు సింగరేణిలో పని చేస్తున్న 2,718 మంది కార్మికులకు జనరల్ మజ్ధూర్లుగా సంస్థ క్రమబద్ధీకరించింది. ఇందుకు సంబంధించిన దస్త్రంపై సోమవారం సీఎండీ శ్రీధర్ సంతకం చేశారు. మరో రెండు రోజుల్లో వీటిని కార్మికులకు అందించనున్నారు. అంతేకాకుండా 21 మంది సెక్యూరిటీ గార్డులకు జమేదార్లుగా ప్రమోషన్లు కల్పిస్తూ సీఎండీ ఉత్తర్వులు కూడా జారీచేశారు. సంస్థలో ప్రస్తుతం పని చేస్తున్న బదీలి కోల్‌ పిల్లర్లు, టన్నెలింగ్‌ మజ్దూర్‌ లు క్రమబద్దీకరణ పొందే వారిలో ఉన్నారు. రామగుండము-1 వ ఏరియాలో 699 మంది, 2వ ఏరియాలో 446 మంది మందమర్రి ఏరియాలో-426, భూపాల పల్లి ఏరియాలో-330, శ్రీరాం పూర్-269, కొత్తగూడెం-266, రామగుండం-3వ ఏరియాలో 243, మణుగూరు-26, బెల్లంపల్లి ఏరియాలో- 14 మంది కార్మికులు లబ్ది పొందనున్నారు. ఇవే కాకుండా ఈ నెల 8న ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో తీసుకున్న పలు నిర్ణయాల అమలుకు రంగం సిద్ధం చేస్తున్నారు.