పురాణాల మాదిరిగా వివాహ వేడుక...

SMTV Desk 2017-10-08 17:36:22  Bridal dress in mythical dress Marriage Celebrations

పశ్చిమగోదావరి, అక్టోబర్ 08 : పద్మావతి దేవిని ఆకాశరాజు వేంకటేశ్వరుడికి ఇచ్చి అత్యంత వైభవంగా త్రిలోక్య ఆది దేవతలా ఆశీర్వచనంతో వివాహం చేశారన్నది పురాణ కథనం. లక్ష్మీదేవిని విష్ణువు మూర్తికి ఇచ్చి బ్రహ్మదేవుడు కల్యాణం జరిపించడాని విన్నాం. అలాంటి వివాహాలను తలిపిస్తూ పశ్చిమగోదావరి జిల్లా ముక్కామల గ్రామానికి చెందిన శ్రీధర్‌స్వామిజీ తన కుమార్తె హర్షిత వివాహ వేడుక అంగరంగ వైభవంగా చేశారు. నాటి పురాణ వైభవాన్ని తలపిస్తూ పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెతో పాటు కుటుంబ సభ్యులంతా పౌరాణిక వేషధారణలో పెళ్లి తంతులో పాల్గొన్నారు. హర్షితను లక్ష్మీదేవిగా.. అల్లుడు వినయ్‌లను మహావిష్ణువుగా అలంకరించటంతో పాటు స్వామిజీ దంపతులు అవతరలేత్తారు. పురాణ పాత్రల మాదిరిగా వస్త్రధారణ కిరీటాలతో వారి వివాహం చేశారు. తణుకులోని ఒక కల్యాణం మండపంలో శుక్రవారం అర్ధరాత్రి అతి కొద్దిమంది బంధువులు, అతిధుల మధ్య నాటి వైభవానికి ప్రతీకగా ఈ కల్యాణం జరిగింది.