కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి

SMTV Desk 2017-10-04 15:22:15  Kaleshwaram Project First Stage Gets Green Signal From National

కాళేశ్వరం, అక్టోబర్ 04 : కాళేశ్వరం ప్రాజెక్టుకు మొదటి దశ అటవీ అనుమతులు లభించాయి. ప్రాజెక్టు వనరుల కోసం అవసరమైన 3, 168 హెక్టార్ల అటవీ భూములను వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని తెలిపింది. ప్రాజెక్టులో భాగంగా కాల్వలు, సొరంగాల తవ్వకం, జలాశయాలు, ఎత్తిపోతల ఏర్పాటు వంటి పనుల కోసం అటవీ భూములు అవసరమని అందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆ ప్రతిపాదనను గత నెల 21వ తేదీన అటవీ సలహా మండలి పరిశీలించి తొలి దశ అనుమతులు మంజూరు చేసింది. మహాదేవ్ పూర్, కరీంనగర్, సిరిసిల్ల, సిద్ధిపేట, యాదాద్రి, మెదక్, నిజామాబాద్, బాన్స్ వాడ, నిర్మల్ అటవీ డివిజన్ లో ఈ భూములు ఉన్నాయి. వాటికి ప్రత్యామ్నాయంగా గుర్తించిన భూముల్లో అడవుల అభివృద్దికి నిధులు మంజూరు చేయడం సహా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర అటవీశాఖ నేపథ్యంలో ఆ భూముల ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు మార్గం అనుకూలమైంది.