ముందేమో నీతి మాటలు.. వెనకేమో అవినీతి మూటలు...!!

SMTV Desk 2017-09-21 14:27:50  corruption, political leaders, leaders corruption

హైదరాబాద్ సెప్టెంబర్ 21: నేటి కొత్త తరం రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు కొంత పంథాను ఎంచుకొని ఎంచక్కా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అందిన కాడికి దోచుకుందాం అన్న చందంగా ప్రస్తుతం వీరి తీరు కనిపిస్తోంది. వీరంతా చాలా కష్టపడి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకొన్న వారే. ఈ రోజుల్లో ఎవరైనా ఎదిగే సమయంలో ఉన్న నీతి నిజాయితీ ఎదిగాక మాత్రం మర్చిపోతున్నారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది సెలబ్రిటీ లుగా మారిన ఎవరైనా వారికి అధికారులతో, వ్యాపారులతో, రాజకీయ నాయకులతో ఇలా ఒకటేమిటి ఎందరితోనో పెరిగిన పరిచయాలు పైగా, ఏ తప్పు చేసినా ఎవరిని ఎలా ఒప్పించాలో తెలిసిన నేర్పు కూడా వీరి సొంతం చేసుకోవడం విశేషం. ఇలా ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ఎం చేసిన చెల్లుతుందనే ధీమా తో ఉన్న వీరు భారీ అవినీతి కార్యకలాపాలకు పాల్పడి, వేల కోట్ల సొమ్మును దోచుకొని విదేశాల్లో దాచుకుంటున్నారు. పైగా మీడియా ముందు, స్టేజ్ షోల్లో, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొని నీతి మాటలు చెప్పడం ఈ రోజుల్లో మామూలైపోయింది. ఇప్పటివరకు నీతి కబుర్లు చెప్పిన ఎందరో సెలబ్రిటీలు, ప్రభుత్వ అధికారులు సైతం ఇప్పుడు ఊసలు లేక్కపెడుతున్నారు. గతంలో పనామాలో మొస్సాక్ ఫోన్సెకా సంస్థ వెల్లడించిన వివరాలు చూస్తే కళ్ళు బైర్లు కమ్మక మానదు. ఈ సంస్థ జాబితాలో అమితాబ్, ఐశ్వర్యారాయ్, డీఎల్‌ఎఫ్ కేపీ సింగ్ నాయకులు, కార్పొరేట్లు సహా 500 మంది భారతీయుల పేర్లు ప్రపంచవ్యాప్తంగా 140 మంది రాజకీయ నాయకులు రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా డజను మంది ప్రస్తుత, మాజీ దేశాధినేతలు అమెరికా నిషేధించిన డ్రగ్ గ్యాంగులు, టైస్టు సంస్థలదీ ఇదే తీరు ఇప్పటికైనా ప్రపంచ దేశాలు మొత్తం ఇలాంటి వీరిపై ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి నిరంతరం వారిపై ఓ కన్నేసి ఉంచేలా ప్రపంచ దేశాలు అన్నీ చర్యలు తీసుకోవాలి. మన దేశంలో ఇలాంటి వారిపై ప్రత్యేక కమిటీని, ప్రత్యేక నిఘా వ్యవస్థని ఏర్పాటు చేసి వారి కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించేలా కట్టు దిట్టమైన చర్యలు చేపట్టాలి. ఇలాంటి వారికి ముకుతాడు వేసే విధంగా చట్టపరమైన చర్యలు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపక్రమించాలి. లేకపోతే మన దేశంలో ప్రజాస్వామ్య బద్ధంగా పాలన కొనసాగుతోందా లేదా అన్న అనుమానం ప్రజలకు వచ్చే ముందే ప్రభుత్వ యంత్రాంగం మేల్కొంటే దేశ ప్రయోజనాలను కాపాడినవారవుతారు.