భావితరాలకు బతుకమ్మ విశిష్టత తెలియాలనేదే నా తపన: ఎం.పీ. కవిత

SMTV Desk 2017-09-20 18:32:49  hyderabad, M.P. kavitha, bathukamma festival

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. ఆనాటి కాలనా ఉయ్యాలో.. ధర్మ౦గుడను రాజు ఉయ్యాలో.... హైదరాబాద్, సెప్టెంబర్ 20: అంటూ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వచ్చేసింది. ఈ పండుగ విశిష్టతపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైన ఎం.పీ. కవిత మాట్లాడుతూ ..." బతుకమ్మ అంటేనే బతుకునిచ్చే పండుగ... రాణి రుద్రమ్మ దేవి కాలంనాటి నుంచే ఈ పండుగకు ప్రాముఖ్యత లభించింది. ప్రజలను కలిసి మెలిసి ఉండేలా చేస్తుందని, తెలంగాణ ప్రాంతీయ వైభవానికి ప్రతీకైనా బతుకమ్మ పండుగ కానుకగా ముఖ్యమంత్రి కేసిఆర్ ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఈ పండుగ ప్రాముఖ్యతను బి.బి.సి. ప్రసారం చేయడం ఆనందంగా ఉందని, నా జీవితంలో ఎప్పటికీ రాజకీయాలు, కుటుంబాలకు సమ ప్రాధాన్యత ఇస్తాను, భావితరాలకు బతుకమ్మ విశిష్టత తెలియాలనేదే నా తపన" అని చెప్పుకొచ్చింది.