నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం.. తీవ్ర ఇక్కట్లలో ప్రజలు

SMTV Desk 2017-09-14 10:43:51  hyderabad, weather, rain fall, today weather

హైదరాబాద్, సెప్టెంబర్ 14: నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షానికి భాగ్యనగర౦ లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, పంజాగుట్ట, దిల్ సుఖ్ నగర్, సైదాబాద్, ఎల్బీ నగర్, ఉప్పల్, హబ్సి గూడ, సికింద్రాబాద్, సఫీల్ గూడ, మౌలాలి పలు ప్రాంతాలలో ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో మల్కాజ్ గిరి లో బండ్ల చెరువు, పొంగి పొర్లుతుండడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాలా పేట, సిరిపురి కాలనీ, చంద్రబాబు నగర్, ఇసుక బావి కాలనీ, శ్రీగిరి కాలనీ లో ఇళ్ళల్లోకి చేరిన నీరుతో స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మియాపూర్ లో తులసి రామ్ చాంబర్స్ లోని స్థానికులు సెల్లార్ లోకి చేరిన నీటిని మోటార్లతో బయటికి పంపుతున్నారు. పలు చోట్ల స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలగడంతో పోలీసులు ఫంక్షన్ హాల్ ను తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.