షబ్బీర్ హుస్సేన్ పై దాడి చేసిన ముగ్గురు అరెస్ట్..

SMTV Desk 2017-09-08 11:34:49  hyderabad, grand snucar center, pathabasthi, police

హైదరాబాద్, సెప్టెంబర్ 8: మొన్న రాత్రి హైదరాబాద్ పాతబస్తీ లో డబీర్ పురా గ్రాండ్ స్నూకర్ సెంటర్ లో క్యాషియర్ షబ్బీర్ హుస్సేన్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. సీసీ ఫుటేజ్ ఆధారంగా దాడి చేసిన దుండగులను గుర్తించిన పోలీసులు, ఈ రోజు ఉదయం వారిని అరెస్టు చేశారు. పోలీసుల కథనాల ప్రకారం..." ఈ ముగ్గురు దుండగులు షబ్బీర్ హుస్సేన్ ను హత్య చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు, దానితో అతడిని తీవ్రంగా గాయపరిచి పరార్ అయ్యారు. వీరిని అమీర్, మెస్సి, హైదర్ గా గుర్తించి అరెస్టు చేశామని" సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు.