అంతర్జాతీయ మైనింగ్ సదస్సుకు కేటీఆర్‌కు ఆహ్వానం

SMTV Desk 2017-09-07 12:54:50  KTR, POCHAARAM SRINIVAAS, T-SHAT, LOGO, THEAM SONG

హైదరాబాద్ సెప్టెంబర్ 6 : ఆస్ట్రేలియా లో జరగనున్న అంతర్జాతీయ మైనింగ్ సదస్సుకు మంత్రి కేటీఆర్ ను ఆహ్వానించనున్నట్టు ఆస్ట్రేలియా మైనింగ్‌ ప్రతినిధి లీవిల్మోట్‌ తెలియజేసినట్టు తెలంగాణరాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌ శేరిసుభా్‌షరెడ్డి పేర్కొన్నారు. ఈ సదస్సు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 3 వరకు జరగనుంది. ఈ సదస్సులో 65 దేశాల ప్రతినిధులు పాల్గోనునట్లు ఆయన తెలిపారు. ఆస్ట్రేలియా లో అధికారిక పర్యటనలో ఉన్న శేరిసుభాష్ రెడ్డి, మల్సూర్ తో కలసి తెలంగాణ రాష్ట్ర మైనింగ్ రంగంలో సాధిస్తున్న అభివృద్ధిపై చర్చించేందుకు బెల్‌బోర్న్‌లో విక్టోరియా రాష్ట్ర మైనింగ్‌ ప్రతినిధి లీ విల్మోట్‌ తో భేటీ అయ్యారు. తెలంగాణలో ఖనిజ వనురుల లభ్యతను గుర్తించేందుకు ఇక్కడ మీరు వినియోగిస్తున్న పరిజ్ఞానాన్ని అందించాలని సుభాష్ రెడ్డి లీ విల్మోట్‌ ను కోరారు. దీనికి లీ విల్మోట్‌ స్పందిస్తూ తెలంగాణ తో స్నేహపూర్వక ఇచ్చిపుచ్చుకునే ధోరణి కొనసాగిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.