ఎవరెస్ట్ పై కీర్తిపతాకం

SMTV Desk 2017-06-04 14:44:34  mount everest,incarnation day, nirus praveen , narayanaked,newdelhi,

హైదరాబాద్, జూన్ 4 : ఎవరెస్ట్ శిఖరాన్ని రెండోసారి అధిరోహించి మన కీర్తిపతాకాన్ని ఇనుమడింపజేసిన తెలుగు తేజం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన నీరుడి ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాష్ర్ట అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఎవరెస్ట్ శిఖరాన్ని చాలా సునాయాసంగా అధిరోహించాడు. తొమ్మిది మంది బృందం సభ్యులు గత నెల 21న న్యూఢిల్లీ నుంచి బయలుదేరి ఉత్తరాఖండ్ లోని గంగోత్రి పార్క్ దగ్గరలో 6,180 మీటర్ల శిఖరాన్ని అధిరోహించారు. మొత్తం 9 మంది సభ్యుల్లో ఐదుగురు మాత్రమే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కారు. ప్రవీణ్ కుమార్ తో పాటు అఖిలేశ్, తిరుపతి, తుకారం, రంగారావులు ఉన్నారు. శిఖరాన్ని అధిరోహించిన అనంతరం వీరు జాతీయ జెండాను ఎగరవేశారు. ఎవరెస్ట్ శిఖరారోహణకు ఆర్ధిక సహాయం అందజేసిన వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్, సత్యసాయి సేవా సమితి జెండాలను సైతం ఆవిష్కరించారు. గత ఏడాది తెలంగాణ రాష్ర్ట అవతరణ దినోత్సవం రోజున ప్రవీణ్ 5,186 మీటర్ల ఎతైన శిఖరాన్ని అవరోహించిన విషయం తెలిసిందే. రెండోసారి కూడా సత్తా చాటుకున్న నీరుడి ప్రవీణ్.