మరికాసేపట్లో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం...

SMTV Desk 2017-09-05 13:17:00  hyderabad, khairatabad, ganeshudu, ganesh immersion

హైదరాబాద్, సెప్టెంబర్ 5: వెళ్లిరా గణనాధ...మళ్ళిరా గణనాధ...అంటూ భక్తులు తెలుగు రాష్ట్రలల్లో విఘ్నేశ్వరులను నిమజ్జనం చేస్తున్నారు. భాగ్యనగరంలో ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనానికి సిద్దం అయ్యాడు. భారి బందోబస్తు ఏర్పాట్ల మధ్య మహాశోభాయాత్ర మార్గ౦ ద్వారా మహాగణపతి ట్యాంక్ బండ్ కు చేరుకుంది. లిబర్టి కూడలి వద్ద గణనాథులను వివిధ మర్గాల్లో ట్యాంక్ బండ్ కు మల్లిస్తున్నారు. బేగంపేట వైపు నుంచి వచ్చే విగ్రహాలు మినిస్టర్ రోడ్ మీదుగా పంపిస్తున్నారు. జీహెచ్ఎంసి సిబ్బంది ఊరేగింపు మార్గాల్లో 165 యాక్షన్ టీం లను, వాటర్ వర్క్స్ శాఖ అధ్వర్యంలో నీటి సరఫరా ఏర్పాట్లు చేపట్టారు. గణేష్ నిమజ్జనం తర్వాత 14 స్వీపింగ్ యంత్రాలతో పారిశుద్ధ్య పనులు చేయనున్నారు. హుస్సేన్ సాగర్ కు తొమ్మిది ప్రధాన మార్గాల్లో గణనాథులు చేరుతున్నారు. విశేష పూజలందుకున్న వినాయక విగ్రహాలు గంగమ్మ ఓడికి చేరుతున్నాయి.