నిమజ్జనం లేని బొజ్జగణపయ్య...!

SMTV Desk 2017-09-03 13:03:53  maharashtra, telangana, adilabad, palaj ganesh temple,

మహరాష్ట, సెప్టెంబర్ 3: ఉ౦డ్రాలయ్య...లంభోధర విఘ్నాల నుండి కాపాడే దేవుడా జై గణేశా. వినాయకచవితి సందర్భంగా బొజ్జగణపయ్యను ప్రతిష్టించుకొని నవరాత్రులు ధూపదీప నైవేద్యాలతో వైభవంగా పూజలు చేసి చివరి రోజున నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించడం మనకు ఆనవాయితీ. అయితే ఈ వూళ్లొ కూడా అలాగే పూజలు చేస్తారు, కానీ నిమజ్జనం చేయరు. అది మహారాష్ట లోని పాలజ్ లో గణపతి దేవాలయం లో చెక్క తో తయారుచేసిన గణపయ్య కొలువు దిరాడు. పాలజ్ విఘ్నేశ్వరున్నికేవలం నవరాత్రులు మాత్రమే పూజలు నిర్వహిస్తారు. నవరాత్రుల్లో మాత్రమే ఆయన దర్శనం లభిస్తుండటంతో దేశం నలుమూలల నుంచీ భక్తులు ఆ గ్రామానికి బారులు తీరుతున్నారు. తెలుగురాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా స్వామిని కొలుస్తారు. నవరాత్రుల సమయంలో స్వామితో పాటు మరో చిన్న మట్టి విగ్రహాన్ని ఉంచి పూజలు చేస్తారు. దాన్ని గోదావరిలో నిమజ్జనం చేసి ఆ నీళ్లను తెచ్చి స్వామి మీద చల్లుతారు. తర్వాత ఆ విగ్రహాన్ని తీసి ప్రత్యేకమైన గదిలో భద్రపరుస్తారు. పాలజ్‌ గ్రామంలో కొలువైన సంకటహర గణపతి మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్‌ జిల్లా. తెలంగాణాలోని ఆదిలాబాద్‌ జిల్లాకు సరిహద్దులో ఉంటుందీ గ్రామం.