రాష్ట్రానికి ప్రథమ పౌరుడు

SMTV Desk 2017-06-04 11:47:45  president, hyderabad, pranab mukargii, bollaram

హైదరాబాద్, జూన్4: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు విచ్చేస్తున్నారు. ఈనెల 17న హైదరాబాద్ చేరుకునే దేశ ప్రథమ పౌరుడు రెండు రోజుల పాటు బోల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఈనెల 17న సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించి రెండు రాష్ట్రాల రాజకీయ, అధికార, ఇతర రంగాల ప్రముఖులకు అతిథ్యం ఇవ్వనున్నారు. ఇందుకోసమై ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి.