విమోచన ఉత్సవాలపై ఆసక్తి కనబరచని కేసీఆర్.. కారణమిదే...!!

SMTV Desk 2017-09-01 11:50:43  september 17, telangana vimochana dinam, kcr, bjp, congress, mim, maslij party

హైదరాబాద్, సెప్టెంబర్1: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం, అధికారాన్ని చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన ఉత్సవాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచడం లేదని ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పై దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని, ఎంఐఎం పార్టీ సపోర్ట్ కోసమే కేసీఆర్ ఈ విషయాన్ని పెడ చెవిన పెడుతున్నారని తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఈ విషయం పై స్పందించకపోవడానికి ఇక్కడ కారణాలు సైతం లేకపోలేదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత రాబోయే కార్పోరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ వివిధ స్థానాల్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ ఏర్పాటు సమయంలో టీఆర్ఎస్ పార్టీకి మస్లిజ్ పార్టీ మద్ధతు తెలుపుతున్న నేపథ్యంలో కేసీఆర్ విమోచన ఉత్సవాలపై శ్రద్ధ కనబరచడం లేదు. పైగా సెప్టెంబర్ 17 వ తేదీన నిజాం నిరంకుశత్వ పాలన నుండి విముక్తి పొందాం కాబట్టి నిజాములకు మస్లిజ్ పార్టీకి సంబంధం ఉన్న నేపథ్యంలో విమోచన ఉత్సవాలను జరిపితే ఎక్కడ మైనారిటీ వర్గం నుండి సమస్య తలెత్తుతుందో అని భావించి కేసీఆర్ ఈ అంశాన్ని పక్కన పెట్టిఉంటారని ప్రజలు భావిస్తున్నారు.