మల్ల్యాకు మళ్ళీ రెక్కలొచ్చాయ్!

SMTV Desk 2019-07-18 15:42:14  vijay mallya

దేశీయా బ్యాంకుల్లో వేలకోట్లు అప్పు తీసుకొని విదేశాలు చెక్కేసిన విజయ్ మాల్ల్యా కేసులో సంచనల తీర్పు చెప్పింది కోర్టు. తనను తిరిగి ఇండియాకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ, మాల్యా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఇప్పట్లో విచారణ జరగబోదు. ఈ కేసు విచారణ ఇప్పట్లో విచారణను చేపట్టలేమని, వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో విచారిస్తామని యూకే కోర్టు గురువారం నాడు స్పష్టం చేసింది. కాగా, మాల్యాను భారత్‌కు అప్పగించాలని వెస్ట్‌ మినిస్టర్‌ కోర్టు నిర్ణయించిన తరువాత, ఆయన రాయల్‌ కోర్ట్స్‌ ఆఫ్‌ జస్టిస్‌ను ఆశ్రయించగా, అప్పీల్‌ చేసుకునేందుకు మాల్యాకు అవకాశమిచ్చారు. దీనిపై ఆయన అప్పీలుకు వెళ్లగా తాజా నిర్ణయం నేడు వెలువడింది.