గిక్సర్ బైక్‌ చూసారా ?

SMTV Desk 2019-07-13 12:24:30  

న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా సరికొత్త గిక్సర్ బైక్‌ను లాంచ్ చేసింది. 2019 సుజుకీ జిక్సర్ 155 పేరిట మార్కెట్లో విడుదలైన ఈ ద్విచక్ర వాహన ధర రూ.1,00,212 (ఎక్స్ షోరూం ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. ఇది మెటాలిక్ సోనిక్ సిల్వర్, గ్లాస్ స్పార్క్‌ల్ బ్లాక్, మెటాలిక్ ట్రిటన్ బ్లూక్ వంటి మూడు రంగుల్లో లభ్యం కానుంది. 155సిసి ఫోర్ స్ట్రోక్ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్, 8000 ఆర్‌పిఎం వద్ద 14 ఎన్‌ఎం టార్క్, 13.9 బిహెచ్‌పి శక్తిని విడుదల చేస్తుంది. 5-స్పీడ్ గేర్ బాక్స్, సింగిల్ చానెల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ వ్యవస్థ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా ఉపాధ్యక్షుడు దెవాశిష్ వెల్లడించారు.