మరికొద్ది సేపట్లో 2019-20 బడ్జెట్‌...లైవ్ అప్‌డేట్స్

SMTV Desk 2019-07-05 11:45:42  budget 2019-20

నేడు పార్లిమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2025 నాటికి 5 లక్షల ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించాలని మోదీ సర్కారు కోరుకుంటున్న సందర్భంగా ఈ బడ్జెట్ పై దేశ ప్రజలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ముందు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు కొనసాగింపుగా.. ఈ బడ్జెట్ ఉండనుంది. ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పన, మధ్యతరగతికి ఊరట, రైతాంగం ఎదుర్కొంటున్న దుస్థితిని తీర్చడం, ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలను ఇచ్చేదిశగా బడ్జెట్ ఉంటుందని భావిస్తున్నారు. ఆదాయపన్ను పరిమితి పెంపు విషయమై వేతన జీవులు ఆశతో ఉన్నారు. ఇప్పటి వరకు బ్రిటిష్ సంప్రదాయం ప్రకారం ఆర్థిక మంత్రులు సూట్‌కేసులో బడ్జెట్ పత్రాలను తీసుకొచ్చేవారు.. కానీ నిర్మలా సీతారామన్ ఆ సంప్రదాయానికి స్వస్తి పలికారు. నాలుగు మడతల ఎర్రటి వస్త్రంలో బడ్జెట్ పత్రాలను తీసుకొని ఆమె పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఆ వస్త్రంపై ఎర్రటి రాజముద్ర కనిపించింది. భారత సంప్రదాయాన్ని పాటిస్తామని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ క్రిష్ణమూర్తి సుబ్రమణియన్ తెలిపారు. బడ్జెట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.. 2014-19 మధ్య ఆహర భద్రత కోసం రెట్టింపు ఖర్చు చేశాం. గత ఎన్నికల్లో నవభారతావని కోసం ప్రజలు తీర్పునిచ్చారు. నవీన భారత రూపకల్పనకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం అని సీతరామన్ పార్లమెంట్‌కు చేరుకుని మీడియాతో మాట్లాడారు. కొన్నేళ్లలోనే భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరనుంది. ఎన్డీయే అకృరంలోకి వచ్చే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 1.85 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. ఈ ఏడాదే 3 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారనుంది అని, గత ఐదేళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. సామాన్యుడి జీవితాలను మార్చేందుకు ప్రయత్నించాం. మేకిన్ ఇండియాకు ప్రాధాన్యం ఇస్తున్నాం. దేశంలో సంపద సృష్టిస్తున్నాం. కనెక్టివిటీ కోసం ఎన్డీయే సర్కారు తీవ్రంగా శ్రమించింది. భారత్ మాల, సాగర మాలతో మౌలిక వసతులను కల్పించాం అని వెల్లడించింది.