స్పైస్‌జెట్ స్పెషల్ ఆఫర్...రూ.888కే టికెట్

SMTV Desk 2019-07-03 13:14:51  SpiceJets Monsoon Sale

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తన టికెట్ ధరలపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. మాన్‌సూన్ సేల్ పేరుతో ప్రారంభించిన ఈ సేల్ లో భాగంగా ప్రయాణికులకు విమాన టికెట్లను రూ.888 ప్రారంభ ధరతో అందిస్తోంది. స్పైస్ జెట్ మాన్‌సూన్ సేల్ పరిమిత కాల ఆఫర్ అని కంపెనీ తెలిపింది. ఇందులో భాగంగా దేశీ విమాన టికెట్ల ధర రూ.888 నుంచి ప్రారంభమౌతోంది. అదే విదేశీ ప్రయాణపు టికెట్ ప్రారంభ ధర రూ.3,499గా ఉంటుంది. డిస్కౌంట్ ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుకింగ్ చేసుకున్నవారు 2019 సెప్టెంబర్ 25లోపు ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. జూలై 6 వరకు మాత్రమే ఈ మాన్‌సూన్ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. డిస్కౌంట్ ధర కేవలం ఒకవైపు ప్రయాణానికి మాత్రమే వర్తిస్తుంది. దీన్ని ఇతర ఆఫర్లతో కలిపి పొందడం వీలుకాదు. జెట్ ఎయిర్‌వేస్ కార్యకలాపాల నిలిపివేత నేపథ్యంలో కంపెనీ ఈ ఆఫర్ ప్రకటించడం గమనార్హం. ఒక సంస్థ కార్యకలాపాలు మూతపడటంతో ఇప్పటికే ఏవియేషన్ మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంది. డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి స్పైస్ జెట్ ఈ ఆఫర్ ప్రకటించిందని అనుకోవచ్చు. కంపెనీ గత వారంలోనే విదేశీ రూట్లలో కొత్త ఫ్లైట్స్ నడుపుతున్నట్లు ప్రకటించింది. ముంబై, ఢిల్లీ నుంచి వీటిని నడపనుంది. అలాగే దేశీ మార్గాల్లోనూ కార్యకలాపాలు విస్తరించింది. కొత్త విమానాలు నడుపుతోంది.