వేతన జీవులకు రూ.10 లక్షల లోన్...

SMTV Desk 2019-06-13 16:19:18  muthoot finance

ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ ముథూట్ ఫైనాన్స్ తాజాగా తన పర్సనల్ లోన్ స్కీమ్‌ను మరింత సరళతరం చేయనుంది. ఈ నేపథ్యంలో ఏకంగా రూ.10 లక్షల వరకు రుణాన్ని అందిస్తోంది. వేతన జీవులకు మాత్రమే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్‌లో భాగంగా రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. వడ్డీ రేటు 13.5 శాతం నుంచి 23 శాతం వరకు ఉంటుంది. 24-58 ఏళ్ల మధ్యలో వయసు కలిగిన వారు ఈ లోన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రైవేట్, రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి మాత్రమే రుణం లభిస్తుంది. 1-5 ఏళ్ల కాలపరిమితితో లోన్ పొందొచ్చు.క్రెడిట్ హిస్టరీ, కేవైసీ, సిబిల్ స్కోర్ వంటి అంశాల ప్రాతిపదికన రుణ మంజూరీ ఉంటుంది. ఇవి అన్‌సెక్యూర్డ్ రుణాలు. తనఖా అవసరం లేదు. అన్ని సక్రమంగా ఉంటే 48 గంటల్లోనే లోన్ పొందొచ్చు.ప్రస్తుతం ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల కస్టమర్లకు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే సేవలకు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని సంస్థ తెలిపింది. నెలకు కనీసం రూ.20,000 జీతం (నికర వేతం, హోమ్ టేక్) ఉండాలి.