అవెంజర్స్ అభిమానులకు గుడ్ న్యూస్!

SMTV Desk 2019-06-12 18:28:23  avengers game

అవెంజర్స్ అభిమానులకు ఓ శుభవార్త. అవెంజర్స్ నుండి ఓ వీడియో గేమ్ రాబోతుంది. స్క్వేర్ ఎనిక్స్ అనే సంస్థ తాజాగా మార్వెల్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మార్వెల్ అవెంజర్స్ వీడియో గేమ్ ఫస్ట్ టీజర్‌ను విడుదల చేసింది. ఈ3 2019 సదస్సులో దీన్ని రిలీజ్ చేసింది. మార్వెల్ అవెంజర్స్ గేమ్‌ను క్రిస్టల్ డైనమిక్స్ సంస్థ రూపొందించనుంది. పీఎస్4, ఎక్స్‌బాక్స్ వన్, స్టాడియా, పీసీ వంటి అన్ని ప్లాట్‌ఫామ్స్‌పై ఈ గేమ్ 2020 మే 15న అందుబాటులోకి రానుంది. సినిమాలో మాదిరే గేమ్‌లో కూడా ఈ ప్రపంచాన్ని విలన్స్ నుంచి రక్షించుకోవాల్సి ఉంటుంది. ఐరన్ మ్యాన్, బ్లాక్ విడో, కెప్టెన్ అమెరికా వంటి పలు క్యారెక్టర్లు ఉంటాయి. గేమ్‌ను ఉచితంగానే ఆడుకోవచ్చు.