అదృష్టపు రాణి: రూ.900 తో కొన్న ఉంగరానికి వేలంలో రూ.5కోట్ల 89 లక్షల 87 వేలు

SMTV Desk 2019-06-12 18:22:46  women buy ring in 13 dollars and sell 8.5 dollars

లండన్: లండన్ లో ఓ ఆశ్చర్య సంఘటన వెలుగులోకి వచ్చింది. కూరగాయల కోసం ఓ యువతి మార్కెట్ కు వెళ్లింది. కూరగాయలు కొన్న తరువాత మిగిలిన డబ్బుతో ఏదైనా కొనాలనుకుని ఉంగరాలు అమ్మే దుకాణానికి వెళ్లింది. అక్కడ 13 డాలర్లు (రూ.900)తో ఓ ఉంగరాన్ని కొనుగోలు చేసింది. కొంతకాలం తరువాత ఆ ఉంగరాన్ని అమ్మేందుకు సదరు యువతి తాకట్టు దుకాణానికి వెళ్లింది. ఆ ఉంగరం చాలా ప్రసిద్ధి చెందినదని, 19వ శతాబ్ధానికి చెందిన ఉంగరమని తాకట్టు దుకాణం వారు ఆ యువతికి తెలిపారు. దీంతో ఈ ఉంగరాన్ని వేలానికి పెట్టారు. వేలంలో ఈ ఉంగం 8.5 లక్షల డాలర్ల (రూ.5కోట్ల 89 లక్షల 87 వేలు)కు అమ్ముడుపోవడంతో ఆమె దశ తిరిగింది. ఈ ఘటనపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.