హైదరాబాద్ లో ఒప్పో ప్రీమియం ఫ్లాగ్షిప్ స్టోర్

SMTV Desk 2019-06-07 17:11:51  oppo store,

ఇండియన్ ప్రీమియం స్మార్ట్‌‌ఫోన్ మార్కెట్‌‌ను అందిపుచ్చుకోవాలని చూస్తోన్న లీడింగ్ గ్లోబల్ స్మార్ట్‌‌ఫోన్ బ్రాండ్ ఒప్పో.. దక్షిణాసియాలోనే తొలి ప్రీమియం ఫ్లాగ్‌‌షిప్ స్టోర్‌‌‌‌ను హైదరాబాద్‌‌లో లాంచ్ చేసింది. కొండాపూర్‌‌‌‌లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌‌లో ఈ స్టోర్‌‌‌‌ను ఏర్పాటు చేసింది. ఒప్పోకు హైదరాబాద్‌‌ ఎంతో ముఖ్యమైన మార్కెట్ అని స్టోర్ లాంచింగ్ సందర్భంగా కంపెనీ ప్రొడక్ట్ మేనేజర్ జితిన్ అబ్రహం చెప్పారు. రోజు రోజుకు హైదరాబాద్ మార్కెట్‌‌ శరవేగంగా వృద్ధి చెందుతోందని, ఈ క్రమంలో భాగంగా తమ తొలి ప్రీమియం ఫ్లాగ్‌‌షిప్‌‌ స్టోర్‌‌‌‌ను ఇక్కడే ఏర్పాటు చేశామని చెప్పారు. ఆర్‌‌‌‌ అండ్ డీ సెంటర్‌‌‌‌ను కూడా అందుకే ఇక్కడ నెలకొల్పినట్టు తెలిపారు. ఒప్పో ఇన్నోవేషన్, టెక్నాలజీని ఎక్కువగా నమ్ముతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడున్న స్టోర్లన్నింటితో పోలిస్తే ప్రస్తుత స్టోర్ డిజైన్‌‌ను సరికొత్తగా రూపొందించారు. 2వేల చదరపు అడుగుల విశాలమైన ఈ స్టోర్‌‌‌‌ను ఇండియన్, హైదరాబాద్ వారసత్వం వెల్లివిరిసేలా డిజైన్ చేసింది.