ఉద్యోగం మారితే పిఎఫ్‌ సంగతి ఏంటి!

SMTV Desk 2019-06-06 12:14:58  EPFO Services, Employees Provident Fund

న్యూఢిల్లీ: పిఎఫ్‌ అకౌంట్ల నుండి ఉద్యోగం మారినప్పుడు గాని లేదా అత్యవసర అవసరాల సమయంలో డబ్బులు విత్‌డ్రా చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగుల కొత్త కంపెనీలో కొత్త అకౌంట్‌ ప్రారంభిస్తారు. అదే సమయంలో పాత యుఎఎస్‌నంబర్‌ ఇవ్వకుండా పొరపాటు చేస్తుంటారు. ఒక్కసారి కొత్త యుఎఎన్‌ తీసుకుంటే, కొత్త కంపెనీ పాస్‌బుక్‌, పిఎఫ్‌ అకౌంట్‌ లావాదేవీలను మాత్రమే చూడగలుగుతాం. రెండు యుఎఎన్‌ నంబర్లు కలిగి ఉండడం వల్ల అకౌంట్‌ వివరాలు పొందడం కూడా క్లిష్టతరమవుతుంది. అందుకే రెండు యుఎఎన్‌ నంబర్లను మెర్జ్‌ చేసుకోవాలి. అయితే ఇది సాధ్యమేనా? సాధ్యమవుతుంది. రెండు యుఎఎన్‌ నంబర్లను విలీనం కలిపేసుకోవచ్చు.ముందుగా మీరు పనిచేస్తున్న కంపెనీకి యుఎఎన్‌ సమాచారం అందించండి. అలాగే ఇపిఎఫ్‌ఒ వెబ్‌సైట్‌లోనూ సమాచారాన్ని అప్‌డేట్‌ చేసుకోవాలి. రెండు యుఎఎన్‌ నంబర్ల గురించి చెబుతూ మెయిల్‌ చేయండి. అధికారులు మీ యుఎఎన్‌ నంబర్లను చెక్‌చేసి, పాత యుఎఎన్‌ను బ్లాక్‌ చేస్తారు. తర్వాత పాత పిఎఫ్‌ డిపాజిట్‌ను కొత్త అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవడానికి దరఖాస్తుచేయసుకోండి. మరో మార్గంలో ముందుగా నంబర్‌ ఇపిఎఫ్‌ అమౌంట్‌ను పాత ఇపిఎఫ్‌ అకౌంట్‌ నుంచి కొత్త దానికి మార్చుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలి. ఇపిఎఫ్‌ఒ ఒటిసిపి పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు.