మార్కెట్లోకి ఎల్‌జీ 8కే స్మార్ట్ టీవీ!

SMTV Desk 2019-06-05 15:20:22  lg oled 88z9

ఎల్‌జీ కంపెనీ తాజాగా ఎల్‌జీ ఓఎల్ఈడీ88జెడ్9 పేరుతో మరో సరికొత్త టీవీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రపంచంలో కస్టమర్ల ముందుకు రాబోతోన్న తొలి 8కే ఓఎల్ఈడీ టీవీ ఇదే. LG 8K TVలో 88 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. దక్షిణ కొరియాలో ఈ టీవీల కోసం ప్రిఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి. 2019 మూడో త్రైమాసికంలో కంపెనీ ఈ టీవీలను ఉత్తర అమెరికా, యూరప్ దేశాల్లో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ టీవీ ధర ఎంతో తెలియాల్సి ఉంది. అయితే ధర 42,000 డాలర్లుగా ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. మన కరెన్సీలో టీవీ ధర దాదాపు రూ.29.4 లక్షలు. ఇకపోతే World s first 8K OLED TV ఇదే కావడం గమనార్హం. ఇది స్మార్ట్ టీవీ కూడా. 4కే టీవీతో పోలిస్తే ఇందులో పిక్చర్ 4 రెట్లు షార్ప్‌గా కనిపిస్తుంది. ఫుల్ హెచ్‌డీ టీవీలతో పోలిస్తే 16 రెట్లు షార్ప్‌గా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో 8కే కంటెంట్ చాలా తక్కువగా అందుబాటులో ఉంది.