పసిడి, వెండి ధరలు మళ్ళీ పైకి

SMTV Desk 2019-06-03 15:06:08  Gold Rate, Silver rate, Bullion market

ఆదివారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. జువెలర్ల నుంచి డిమాండ్ పెరగడం, బలమైన అంతర్జాతీయ ట్రెండ్ ఇందుకు కారణం. దేశీ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర మళ్లీ రూ.33,000 మార్క్ పైకిచేరింది. అదేసమయంలో గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు మళ్లీ 1,300 డాలర్ల మార్క్‌ను అధిగమించింది. దేశీ మార్కెట్‌లో బంగారం ధర ఈ వారంలో ఏకంగా రూ.350 మేర పెరిగింది. సోమవారం (మే 27) రూ.32,770గా ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం (జూన్ 1) రూ.33,120కు ఎగసింది. అదేసమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,600 నుంచి రూ.32,950కు చేరింది. ఇక కేజీ వెండి ధర రూ.80 పెరుగుదలతో రూ.37,500 నుంచి రూ.37,580కు ఎగసింది.