వివాహిత నగ్న చిత్రాలు తీసి...... బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకులు!

SMTV Desk 2019-05-31 13:04:53  woman

ఇంటిపక్కన ఒంటరిగా వుండే యువతిపై కన్నేసిన ఇద్దరు యువకులు ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్లాన్ చేశారు. ఇంటికి విందుకు పిలిచి ఉద్దేశపూర్వకంగా ఆమె దుస్తులపై పండ్ల రసం పడేశారు. ఆపై దుస్తులు మార్చుకోవాలంటూ గదిలోకి పంపి ఫొటోలు, వీడియోలు తీశారు. ఆపై వాటిని ఆమెకు చూపించి బెదిరింపులకు దిగారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరిగిందీ ఘటన.

సైబర్ క్రైం పోలీసుల కథనం ప్రకారం.. పాతబస్తీకి చెందిన ఓ వివాహిత భర్తతో విభేదాల కారణంగా తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. విషయం తెలిసిన ఇద్దరు యువకులు ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయగా ఆమె నిరాకరించింది. దీంతో ఆమె ఇంటి పక్కనే ఉండే మరో యువతి ద్వారా తమ ప్లాన్‌ను అమలు చేశారు. బాధితురాలి పక్కింటివారు ఏదో ఫంక్షన్ చేస్తున్నారని తెలిసిన నిందితులు తమ ప్లాన్‌ను అమలు చేశారు. విందుకు ఆమెను కూడా ఆహ్వానించేలా చేశారు.