ప్రపంచంలో తొలిసారి 7ఎన్ఎం ప్రాసెసర్ తో లెనొవొ, క్వాల్‌కామ్ 5జీ ల్యాప్‌టాప్స్

SMTV Desk 2019-05-31 11:51:30  Qualcomm and Lenovo, Qualcomm and Lenovo reveals the worlds first 5G laptop

తాజాగా మొబైల్ హ్యాండ్‌‌సెట్స్ తయారీ కంపెనీలు 4జి ని ఒదిలేసి 5జీ సర్వీసెస్ లో నిమగ్నమై ఉన్నాయి. అలాగే ఇవి 5జీ స్మార్ట్‌టీవీలపై కూడా పనిచేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా టెక్ కంపెనీలు 5జీ ల్యాప్‌టాప్స్‌పై కసరత్తు చేస్తున్నాయి. అమెరికాకు చెందిన చిప్ తయారీ కంపెనీ క్వాల్‌కామ్, చైనాకు చెందిన కంప్యూటర్ల తయారీ కంపెనీ లెనొవొ సంస్థలు 5జీ ల్యాప్‌టాప్స్ కోసం చేతులు కలిపాయి. ప్రాజెక్ట్ లిమిట్‌లెస్ కోడ్ నేమ్‌తో ఈ 5జీ ల్యాప్‌టాప్ పనులు జరుగుతున్నాయి. ఇందులో ప్రపంచంలోనే తొలిసారిగా 7ఎన్ఎం ప్రాసెసర్ ఉండబోతోంది. లెనొవొ, క్వాల్‌కామ్ కంపెనీలు రూపొందిస్తున్న ల్యాప్‌టాప్స్.. స్నాప్‌డ్రాగన్ 8సీఎక్స్ కంప్యూటర్ ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తాయి. అంటే ఇవి 5జీతోపాటు 4జీని కూడా సపోర్ట్ చేస్తాయి. అలాగే వీటిల్లో బ్యాటరీ చార్జింగ్ కూడా కొన్ని రోజులపాటు రానుంది. 5జీ ల్యాప్‌టాప్స్‌లో స్నాప్‌డ్రాగన్ ఎక్స్55 5జీ మోడెం‌ను అమర్చనున్నారు. దీంతో 2.5 జీబీపీఎస్ స్పీడ్‌తో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇవి ఎప్పుడు మార్కెట్‌లోకి వచ్చేది తెలియదు. క్వాల్‌కామ్, లెనొవొ సంస్థలు 5జీ ల్యాప్‌టాప్ గురించి కంప్యూటెక్స్ సదస్సులో ప్రకటన చేశాయి. ఈ కాన్ఫరెన్స్ తైవాన్‌లో జరుగుతోంది.