శాంసంగ్ గెలాక్సీ ఏ50 ధర తగ్గింపు

SMTV Desk 2019-05-30 13:11:50  Samsung Galaxy A50

శాంసంగ్ కంపెనీ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన గెలాక్సీ ఏ50 స్మార్ట్‌ఫోన్ ధర రూ.2,500 తగ్గించింది. ధర తగ్గింపు నేపథ్యంలో గెలాక్సీ ఏ50లో 4 జీబీ ర్యామ్ వేరియంట్ రూ.18,490కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.21,000. స్మార్ట్‌ఫోన్‌పై ధర తగ్గింపు అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఏ50లో 4 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.18,490. ఇక 6 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.21,490. అయితే ఈ ధర తగ్గింపు తాత్కాలికమా? లేక శాశ్వతమా? అనే విషయం తెలియదు. శాంసంగ్ గెలాక్సీ ఏ50లో 6.4 అంగుళాల స్క్రీన్, ఇన్‌ఫినిటీ యూ సూపర్ ఆమ్‌లెడ్ డిస్‌ప్లే, ఇక్సినోస్ 9610 ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా (25 ఎంపీ+5 ఎంపీ+8 ఎంపీ), 25 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి.