మార్కెట్లోకి టిక్‌టాక్ స్మార్ట్‌ఫోన్స్...?

SMTV Desk 2019-05-30 12:18:25  titok, tiktok smartphones

మార్కెట్లోకి వచ్చిన అతి తక్కువ సమయంలో అత్యధిక పాపులారిటీ సాధించిన సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్. ఇది కేవలం యూత్ మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారికి చేరువ అవుతోంది. టిక్‌టాక్ సంస్థ వారి కస్టమర్లకు అదిరిపోయే న్యూస్ తీసుకువచ్చింది. టిక్‌‌టాక్ పేరెంట్ కంపెనీ బైట్‌డాన్స్.. స్మార్ట్‌ఫోన్స్ తీసుకువచ్చేందుకు సిద్ధమౌతోందని అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది. టిక్‌టాక్ స్మార్ట్‌ఫోన్ వార్తలు నెటింట చక్కర్లు కొడుతున్నాయి. టిక్‌టాక్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉంటుందో తెలియదు. ఫోన్ డిజైన్, ఫీచర్లు వంటి వాటికి సంబంధించి ఎలాంటి విషయాలు బహిర్గతం కాలేదు. అలాగే ఈ ఫోన్లు ఎప్పుడు మార్కెట్‌లోకి వచ్చేదీ తెలియదు. కానీ టిక్‌టాక్ కంపెనీ ఇప్పటికే స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీ స్మార్టిసన్‌‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. టిక్‌టాక్ స్మార్ట్‌ఫోన్‌‌లో కెమెరాలు ప్రధాన ఆకర్షణగా నిలవొచ్చు. మరీముఖ్యంగా సెల్ఫీ కెమెరా ఫీచర్ అదిరిపోవచ్చనే అంచనాలున్నాయి. టిక్‌టాక్ వీడియోలకు ఫ్రంట్ కెమెరా చాలా కీలకం. కాగా కంపెనీ ప్రతినిధులు ఎవ్వరూ స్మార్ట్‌ఫోన్స్ తయారీ వార్తలపై స్పందించలేదు.