తొలి ల్యాప్‌టాప్ ము లాంచ్ చేసిన రెడ్‌మి

SMTV Desk 2019-05-29 15:22:10  RedmiBook 14

ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ షావోమి తాజాగా ల్యాప్‌టాప్స్ విభాగంలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో బీజింగ్‌లో మంగళవారం జరిగిన రెడ్‌మి కే20, కే 20 ప్రో స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ కార్యక్రమంలో కంపెనీ తొలి ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. దీని పేరు రెడ్‌మి బుక్14. రెడ్‌మి ల్యాప్‌టాప్ ప్రిఆర్డర్లు చైనా మార్కెట్‌లో జూన్ 1 నుంచి ప్రారంభమౌతాయి. జూన్ 11 నుంచి కస్టమర్ల ముందుకు వస్తాయి. గ్లోబల్ మార్కెట్‌లో ఇవి ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయో తెలియదు. ఈ ల్యాప్‌టాప్ ధర రూ.40,000 నుంచి ప్రారంభమౌతోంది. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు ఈ ధర వర్తిస్తుంది. ఇక 512 జీబీ వేరియంట్ ధర రూ.43,000గా ఉంది. ఈ రెండింటిలోనూ ఇంటెల్ ఐ5 ప్రాసెసర్ ఉంటుంది. ఇక ఇంటెల్ ఐ7 ప్రాసెసర్ కలిగిన 512 జీబీ వేరియంట్ ధర రూ.50,000.రెడ్‌మి ల్యాప్‌టాప్‌లో 14 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌కు ఒక్కసారి చార్జింగ్ పెడితే 10 గంటల వరకు వస్తుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్, స్టూడెంట్ ఎడిషన్ వంటివి ప్రిఇన్‌స్టాల్‌గా ఉంటాయి. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ర్యామ్ పరిమాణం 8 జీబీ.