కుదుటపడ్డ ఇంధన ధరలు

SMTV Desk 2019-05-29 14:14:26  Petrol, Deseal, Price, New delhi

గత ఆరు రోజుల నుండి వరుసగా పెరిగిన ధరలు బుధవారం కాస్త కుదుటపడ్డాయి. బుధవారం (మే 29) పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మంగళవారం నాటి ధరలే కొనసాగాయి. హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.76.22 వద్ద, డీజిల్ ధర రూ.72.53 వద్ద ఉంది. దేశంలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.71.86 వద్ద, డీజిల్ ధర రూ.66.69 వద్ద కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ రూ.77.47 వద్ద, డీజిల్ ధర రూ.69.88 వద్ద కొనసాగుతోంది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగానే ఉన్నాయి. పెట్రోల్‌ ధర రూ.75.96 వద్ద, డీజిల్‌ ధర రూ.71.87 వద్ద ఉంది. ఇక విజయవాడలో పెట్రోల్ ధర రూ.75.60 వద్ద, డీజిల్ ధర రూ.71.55 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.54 శాతం తగ్గుదలతో 68.30 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.69 శాతం క్షీణతతో 58.73 డాలర్లకు దిగొచ్చింది.