టాటా స్కై సబ్‌స్క్రైబర్లకు అదిరిపోయే ఆఫర్

SMTV Desk 2019-05-29 14:12:10  tata sky

టాటా స్కై తన సబ్‌స్క్రైబర్లకు అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది. యాన్వల్ ఫ్లెక్సి ప్లాన్ రూపంలో ఒక నెల ఉచిత సేవలు అందిస్తోంది. అంటే మీరు 12 నెలలకు డబ్బులు చెల్లిస్తే.. 1 నెల బిల్లు మొత్తాన్ని కంపెనీ మీ అకౌంట్‌లో ఉచితంగా జమ చేస్తుంది. టాటా స్కై ఫ్లెక్సి యాన్వల్ ప్లాన్ విషయానికి వస్తే యూజర్లు నెలవారీ బిల్లుకు 12 రెట్లు అధిక మొత్తాన్ని వారి అకౌంట్‌లో కలిగి ఉండాలి. అప్పుడు ఫ్లెక్సి ప్లాన్ పొందొచ్చు. ఉదాహరణకు మీ నెలవారీ బిల్లు రూ.200 అనుకుంటే.. మీ అకౌంట్‌లో రూ.2,400 బ్యాలెన్స్ కలిగి ఉండాలి. అప్పుడు టాటా స్కై యాన్వల్ ఫ్లెక్సి ప్లాన్ సదుపాయాలు లభిస్తాయి. మీరు మీ అకౌంట్‌లో రూ.2,400 బ్యాలెన్స్ కలిగి ఉంటే కంపెనీ మీ అకౌంట్‌లో రూ.200 జమచేస్తుంది. టాటా స్కై యూజర్లు వారి ప్లాన్లను మార్చుకోవచ్చు. అయితే బ్యాలెన్స్ మాత్రం 12 నెలలకు పైనే ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మీరు మీ ప్లాన్‌ను సవరించేటప్పుడు నెలవారీ బిల్లు రూ.300 అయితే.. అప్పుడు మీ అకౌంట్‌లో రూ.3,600 ఉండేటా చూసుకోవాలి. అప్పుడే యాన్వల్ ఫ్లెక్సి ప్లాన్ ప్రయోజనాలు లభిస్తాయి. బోనస్ అమౌంట్ ప్లాన్ చివరి రోజు అకౌంట్లో జమవుతుంది.