ఫ్లిప్‌కార్ట్ మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్...భారీ డిస్కౌంట్స్

SMTV Desk 2019-05-29 12:25:56  flipkart month end mobiles fest

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ పేరుతో మెగా సేల్ ను నిర్వహిస్తుంది. ఈ సేల్ లో వివిధ స్మార్ట్‌ఫోన్స్‌పై బెస్ట్ డీల్స్ సొంతం చేసుకోవచ్చు. మే 31 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. మే 31 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. మంత్ ఎండ్ సేల్‌లో భాగంగా యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు వారి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా నిర్వహించే ఈఎంఐ లావాదేవీలపై 5 శాతం తక్షణ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే రెగ్యులర్ డిస్కౌంట్‌తోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్ సదుపాయం కూడా ఉంది. కేవలం రూ.99కే మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ పొందొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది. సేల్‌లో భాగంగా యాపిల్ ఐఫోన్ ఎక్స్‌ను రూ.66,499కు కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.91,900. నోకియా 5.1 ప్లస్ (3 జీబీ ర్యామ్/32 జీబీ మెమరీ) ధర రూ.8,199గా, హానర్ 9ఎన్ ధర రూ.8,499గా, హానర్ 10 లైట్ (4 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ) ధర రూ.11,999గా, నోకియా 6.1 (3 జీబీ ర్యామ్/32 జీబీ మెమరీ) ధర రూ.6,999గా ఉంది. ఎంఐ ఏ2 ఫోన్‌ను రూ.9,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.