రెండు రోజుల్లో రూ.3.86 లక్షల కోట్లు సంపద పెంపు

SMTV Desk 2019-05-28 16:44:07  investors income increases

ముంబై: మోదీ సర్కార్ మళ్ళీ కుర్చీ ఎక్కడంతో కేవలం రెండు రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద రూ.3.86 లక్షల కోట్లు పెరిగింది. రెండు రోజుల్లో 872 పాయింట్లు లాభపడి ఇన్వెస్టర్ల సంపద వేగంగా పెరిగింది. 30 షేర్ల బిఎస్‌ఇ(బాంబే స్టాక్ ఎక్సేంజ్) సూచీ సోమవారం 248 పాయింట్లు లాభపడి 39,683 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తానికిస్టాక్ మార్కెట్లు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. ఇక నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 11,924 వద్ద స్థిరపడింది. కాగా ఈక్విటీ మార్కెట్‌లో ర్యాలీ నేపథ్యంలో బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ మూలధనం(ఎంక్యాప్) రూ.3,86,220 కోట్లు పెరిగింది. దీంతో బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.1,54,11,395 కోట్లకు చేరింది.