అమెజాన్ లో హానర్ డేస్ సేల్....బంపర్ ఆఫర్స్

SMTV Desk 2019-05-27 17:54:43  amazon honor day sale

హానర్ సంస్థ మరోసారి ఈ కామర్స్ సంస్థ దిగ్గజం అమెజాన్ తో చేతులు కలిపి స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం హానర్ డేస్ సేల్ నిర్వహిస్తోంది. ఈ నెల 31 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది. ఇందులో నో కాస్ట్ ఈఎంఐ, బ్యాంక్ ఆఫర్, ఎక్స్చేంజ్ తగ్గింపు వంటి ప్రయోజనాలు ఉన్నాయి. హానర్ డేస్ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఏకంగా రూ.9,000 వరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. హానర్ 9ఎన్ ఫోన్ ధర రూ.9,999 నుంచి ప్రారంభమౌతోంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ వేరియంట్‌కు ఈ ధర వర్తిస్తుంది. దీని అసలు ధర రూ.15,999. ఇక 4 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.11,999గా ఉంది. దీని అసలు ధర రూ.19,999. హానర్ 8ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.12,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. 4 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ వేరియంట్‌కు ఈ ధర వర్తిస్తుంది. దీని అసలు ధర రూ.17,999. 6 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ ధర రూ.19,999 కాకుండా రూ.14,999గా ఉంది. హానర్ 10 లైట్ ధర రూ.9,999 నుంచి ప్రారంభమౌతోంది. హానర్ ప్లే ధర రూ.14,999గా ఉంది. 4 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. దీని అసలు ధర రూ.21,999.హానర్ వ్యూ20 ధర రూ.37,999గా ఉంది. 6 జీబీ ర్యామ్/128 జీబీ మెమరీ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. దీని అసలు ధర రూ.42,999. ఇక 8 జీబీ ర్యామ్/256 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.45,999గా ఉంది. దీని అసలు ధర రూ.50,999.