ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మెడిసిన్

SMTV Desk 2019-05-25 22:18:48  Novartis wins approval for worlds most expensive drug, gene therapy

వాషింగ్టన్‌: స్విస్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ నోవట్రిస్‌ తాజాగా తయారుచేసిన ఈ జీన్‌ థెరపీ మందు జొలెన్‌సస్మాకు అమెరికా ఆమోదం లభించింది. ఈ మెడిసిన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా పేరుగాంచింది. చిన్నారుల్లో వచ్చే అత్యంత అరుదైన వ్యాధి స్పైనల్‌ మస్కలర్‌ ఆట్రోఫీ. ప్రతి 10వేల మందిలో ఒకరికి చాలా అరుదుగా ఈ వ్యాధి వస్తుంటుంది. ఇలాంటి సమస్యతో పుట్టిన చిన్నారుల వెంటనే చనిపోతారు. లేదా రెండేళ్లు వచ్చే వరకూ వీరు కృత్రిమ శ్వాస మీద బతకాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా వాళ్లు చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సి ఉంటుంది. ఇలాంటి వారి కోసం జీన్‌ థెరపీ విధానంలో ఈ ఔషధాన్ని వాడుతూ వ్యాధి నియంత్రణ చేస్తారు. ఇంతకీ దీని ధర ఎంతో తెలుసా 2.1మిలియన్‌ డాలర్లు. ఔషధ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన డ్రగ్‌గా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం జొలెన్స్‌స్మా ధర విని ఆశ్చర్యపోయారట. ధరను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని అమెరికా అధికారులు తెలిపారు.