దిగ్విజయ్ సింగ్ పై 10 కోట్ల పరువు నష్ట దావా

SMTV Desk 2017-06-03 13:39:49  digvijaysingh,congress,

హైదరాబాద్, జూన్ 3 : మియాపూర్ లోని భూముల కబ్జా విషయంలో తన ప్రమేయం ఉందంటూ ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ పై రూ. 10 కోట్లు పరువు నష్టం దావా తో పాటు క్రిమినల్ కేసు కూడా పెట్టనున్నట్లు పశు సంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం అయన సచివాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో ప్రధాన కార్యదర్శి గా ఉన్న దిగ్విజయ్ సింగ్ భాద్యతారహితమైన వ్యాఖ్యలు చేయడం తగదని హితవుపలికారు. ఎవరో చెప్పిన మాటలు నమ్మి ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు. గత 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో కొనసాగుతూ నాలుగు సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికైన నేను నా వ్యక్తి గత ప్రతిష్ట ను దెబ్బ తినేల వ్యాక్యాలు చేసినందుకు దిగ్విజయ్ భాహిరంగంగా నాకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే 10 కోట్లు పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. తన న్యాయవాదులు ఆయనకు లీగల్ నోటీసులు కూడా పంపిచిన్నట్లు తెలిపారు. అయన మీద మహంకాళి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసామని వెల్లడించారు. రాజకీయ అవసరాల కోసం ఏది పడితే అది మాట్లాడటం సరికాదన్నారు. మీ దగ్గర ఆధారాలు ఉంటె బయట పెట్టాలని డిమాండ్ చేసారు.