ఎన్నికల కోడ్ కెసిఆర్ ఉల్లగించలేదు..అదంతా అబద్దం

SMTV Desk 2019-05-09 13:46:14  KCR,

ఎన్నికల సమయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు. కానీ అదంతా కూడా అబద్దం అని తేలిపోయింది. కాగా ఎన్నికల కోడ్‌ ప్రారంభమైనప్పటి నుండి తెలంగాణ నివాసమైన ప్రగతి భవన్ లో ఎలాంటి పార్టీ కి సంబందించిన సమావేశాలేమి కూడా జరగలేదని, తన నివాసాన్ని కెసిఆర్ ఎప్పుడు కూడా దుర్వినియోగం చేయలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు… కంతేకాకుండా కెసిఆర్ కోడ్ ఉల్లంఘించారు అని అనడంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు…

ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఎక్కే రుడోలాకు దీనికి సంబందించిన విషయాలని ప్రస్తావిస్తూ ఒక లేఖ కూడా రాశారు. అంతేకాకుండా తెలంగాణాలో ఎన్నికల కోడ్ వచ్చినప్పటినుండి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో, ఆమె కుమారులతో సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదు చేసిన సంగతి మనకు తెలిసిందే… కాగా ఈ సంఘటన పై పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సీఈవోను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించగా, స్థానిక రిటర్నింగ్‌ అధికారి, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి దర్యాప్తు చేశారని, అసలు అలంటి సమావేశాలు ప్రగతి భవన్ లో ఎలాంటి సమావేశాలు జరగలేదని రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్నీ రజత్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి అందించారు.