వనస్థలిపురంలో భారీ దోపిడీ.. రూ.70 లక్షలు స్వాహా

SMTV Desk 2019-05-07 16:06:49  Axix bank, Vanasthali puram

హైదరాబాద్ లో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో పట్టపగలే చోరీ జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది.ఇక వివరాల్లోకి వెళితే.. మంగళవారం మధ్యాహ్నం వనస్థలిపురం పనామా కూడలి వద్ద గుర్తు తెలియని దుండగుడు రూ.70 లక్షలు ఎత్తుకెళ్లాడు.

స్థానికుల సమాచారం ప్రకారం .. యాక్సిస్‌ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన సిబ్బంది నగదు పెట్టెలను వాహనం నుంచి కిందికి దింపుతున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ దుండగుడు కింద డబ్బులు పడ్డాయని సెక్యురిటీ గార్డుకు మాయమాటలు చెప్పి దృష్టి మరల్చి నగదు పెట్టెను ఎత్తుకెళ్లాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజిలను పరిశీలిస్తున్నారు. దుండగుడి కోసం గాలింపు చేపట్టారు.