ధృవపత్రాల పరిశీలన జూన్ 12 నుండే

SMTV Desk 2017-06-03 11:54:41  tspsc, verifications, group-2, tspsc group-2 results

హైదరాబాద్, జూన్ 3 : టీఎస్ పీఎస్సీ గ్రూప్ -2 పరీక్ష నిర్వాహణ, ఫలితాల వెల్లడి నిరుద్యోగులను తీవ్ర అసహానానికి గురిచేసింది. గత సంవత్సరం నవంబర్ లో నిర్వహించిన పరీక్షకు సంబంధించి రెండు నెలల్లోనే ఫలితాలు వెల్లడిస్తామని మార్చ్ లోగా నియామకాలు పూర్తి చేస్తామని ప్రకటించి..అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారు. అయితే ఎట్టికేలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రూప్ -2 ఫలితాలను అందించిన టిఎస్ పిఎస్ సి ఎంపిక ప్రక్రియలను వేగవంతం చేసింది. ఈనెల 12 నుండే ధృవపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు పేర్కొంది. ధృవప త్రాల పరిశీలన కు మెుత్తం 1:3 నిష్పత్రిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. ఆ ప్రకారం వెయ్యి 32 పోస్టులకు గాను 3 వేల 147 మంది ధృవపత్రాల పరిశీలన కోసమై అర్హత సాధించారు. ఇందుకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను టిఎస్ పిఎస్ సి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 12 నుంచి ఛాపెల్ రోడ్డులోని స్టాన్లీ ఉమెన్స్ ఇంజనీరింగ్ కళశాలలో ధృవపత్రాల పరిశీలనను చేపట్టనున్నారు. ఆన్ లైన్ లో ధృవపత్రాల పరిశీలనకు హజరు కావాల్సిన అభ్యర్థుల వివరాలు, వెంట తెచ్చుకోవాల్సిన ఒరిజనల్ సర్టిఫికెట్ల వివరాలను అందుబాటులో ఉంచారు. ధృవపత్రాల పరిశీలన తరువాత 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలువనున్నారు.